పుట:VrukshaSastramu.djvu/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురుషపుష్పములు:--

పుష్పకోశము:- అసంయుక్తము, రక్షక పత్రములు 6. నీచము.

దళవలయము:- అసంయుక్తము. 6 రక్షక పత్రములలో సగము పొడుగుండును.

కింజల్కములు:- 6. గదవలేనుండును. ఆకర్షణపత్రములకంటె పొడుగు. పుప్పొడితిత్తులు రెండు. కాడల చివర నున్న కండలో దిగి యున్నవి.

స్త్రీపుష్పము:- పుష్పకోశమును దళవలయమును పురుషపుష్పము నందువలెనే యుండును.

కింజల్కములు:- కాడలు ఆరు. పుప్పోడితిత్తులులేవు.

అండకోశము:- అండాశయము ఉచ్చము. విభక్తాండాశయము. 3. కీలము ఒకటి. కీలాగ్రముచీలియున్నది. సాధారణముగ నీమూడు నెదుగవు. అండ మొక్కొక్క దానిలో నొక్కొక్కటి కండ కాయ., జీడిగింజ (ఫలము) ఆకారముగ నుండును.

ఈ కుటుంబములోనున్న మొక్కలు తిరుగుడి తీగెలే. ఆకులు ఒంటరిచేరిక, వానికి గణుపుపుచ్చములుండవు. పువ్వులు మెండుగానుండును. అవి యేకలింగపుష్పములు. అండాశయము క్రింద గొంచము కలిసియుండును గాని పైన విడిగానెయుండును.

తిప్పతీగె:- ఔషధములలో వాడుదురు. కొమ్మలు, వ్రేళ్ళనుంచి తీసిన కషాయము కొన్నిజ్వరములకు బని