పుట:VrukshaSastramu.djvu/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బనికివచ్చును. కొందరు కూరగాయలందును దీనిని వాడు చున్నారు.

ఉవ్వ కుటుంబము.

ఉవ్వచెట్టు కొండల మీద బెరుగును. ఇది అందముగా నుండుట చే తోటలందును బెంచు చున్నారు.

ప్రకాండము: -- వంకరలు లేక తిన్నగా నుండును. కాని కొంచమే ఎత్తుండును. కొమ్మలు గుండ్రముగా వ్వాపించును.

ఆకులు: -- ఒంటరి చేరిక, లఘు పత్రములు తొడిమలు కురుచనివి. నిడివిచౌకపు నాకారము. రెండువైపులనున్నగనుండును. అంచున రంపపు పండ్లు గలవు. కొనసన్నము.

పుష్పమంజరి: -- కణుపుసందుల నొక్కొక్క పువ్వు గలదు. పువ్వులు పెద్దవి. భూమి వైపు వంగి యుండును.

పుష్పకోశము: -- రక్షక పత్రములైదు. గుండ్రముగాను దళసరిగాను నున్నవి. ఇదియు బెరుగుచు కాయను మరుగు పరచును. నీచము.

దళవలయము: -- అసంయుక్తము. వృంతాశ్రితము. 5 ఆకర్షణ పత్రములు. తెలుపు రంగు, వీనికి మంచివాసనగలదు.

కింజల్కములు: -- అసంఖ్యములు. కాడలు పొట్టివి. పుప్పొడి తిత్తులు సన్నము. మధ్యనున్న పుప్పొడితిత్తులు సన్నము. మధ్యనున్న పుప్పొడి తిత్తులు కీలాగ్రముక్రింద వంగి యున్నవి.

అండకోశము: -- విభక్తాండాశయము. ఉచ్చము ఒక్కొక్కగది