58 (పునరుక్తము)
ఇక నేయే లక్షణములను బట్టి కుటుంబము లేర్పడుచున్నవొ, ఆకుటుంబపు టుపయోగము లేవియో తెలిసికొందము.
నాభికుటుంబము.
నాభికుటుంబములోని మొక్కలు చాలాభాగము శీతల ప్రదేశములలో బెరుగుచున్నవి. వీనిలో నించుమించు అన్నియు గుల్మములు. ఆకులు ఒంటరిచేరిక, ఒకజాతిమొక్కలందు మాత్ర మభిముఖచేరికగానున్నవి. రక్షకపత్రములు, ఆకర్షణపత్రములు లేవు. కిందల్కములు స్త్రీపత్రములు అసంఖ్యములుగా నున్నవి. గింజలలో అంకురచ్చదనముగలదు.
నాభి:-ఒక మొక్కయొక్క ఎండబెట్టినవేరు. ఈజాతి మొక్కలన్నియు హిందూస్తానమున హిమాలయపర్వతములమీద బెరుగుచున్నవి. నాభిలోనే చాలారకములు గలవు. కొన్ని కొంచెము తెల్లగా నుండును, కొన్ని యర్రగానుండును, కొన్నిచిన్నవి, ఇంకను ఎన్నోరకములున్నవి. ఈరకములన్నియుబొడుముచేసి గోధుమపిండితోదనైనను, ఇట్టిది మదిదేనితోనైనను కలిపి మిక్కిలిచిన్నచిన్న మోరాదులుగ లోపలికి బుచ్చుకొనవచ్చును. అదినరములకు బలముచేయును; అతి