పుట:VrukshaSastramu.djvu/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక నేయో లక్షణములను బట్టి కుటుంబము లేర్పడుచున్నవో, ఆకుటుంబపు ఉపయోగము లేవియో తెలిసికొందము.

నాభి కుటుంబము


నాభి కుటుంబములోని మొక్కలు చాల భాగము శీతల ప్రదేశములలో బెరుగు చున్నవి. వీనిలో నించుమించు అన్నియు గుల్మములు. ఆకులు ఒంటరిచేరిక, ఒక జాతి మొక్కలందు మాత్రమభిముఖచేరిక గానున్నవి. రక్షక పత్రములు, ఆకర్షణ పత్రములు లేవు. కింజల్కములు స్త్రీపత్రములు అసంఖ్యములుగా నున్నవి. గింజలలో అంకురచ్ఛదనము గలదు.

నాభి:.... ఒక మొక్క యొక్క ఎండ బెట్టినవేరు. ఈ జాతి మొక్కలన్నియు హిందూస్థానమున హిమాలయాపర్వతముల మీద బెరుగుచున్నవి. నాభి లోనే చాల రకములు గలవు. కొన్ని కొంచెము తెల్లగా నుండును, కొన్ని ఎర్రగా నుండును. కొన్నిచిన్నవి. ఇంకను ఎన్నో రకములున్నవి. ఈ రకములన్నియు బొడుము చేసి గోదుమపిండితోడనైనను, ఇట్టిది మరిదేనితో నైనను కలిపి మిక్కిలిచిన్నచిన్న మోతాదులుగ లోపలికి బుచ్చుకొనవచ్చును. అది నరములకు బలము చేయును; అతి