లో బెక్కుగింజలుండును. ఒక్కొక్కదానికొక్కొక్క కీలమును కీలాగ్రమును గలవు. కీలము మిక్కిలి పొట్టిగను కీలాగ్రముకొంచెము పొడుగగను నున్నవి.
ఇదియొక చిన్న కుటుంబము. దీనిలో పెద్దచెట్లు, చిన్న మొక్కలు కూడ కలవు. ఆకులు ఒంటరిచేరిక, వీనికి గణుపు పుచ్చము లుండవు. ఆకులు సాధారణముగ గొమ్మల చివర గుబురులు గుబురులుగానుండును. ఆకర్షణపత్రములన్నియు విడివిడిగా నుండును. కింజల్కములు చాలగలవు. అండాశయములును విడివిడిగానుండును.
కొమ్మల చివర ఆకులుండుటయు కొమ్మ లన్నియు దట్టముగా మాను చివర చుట్టు నుండుటయు నీ చెట్టున కందమిచ్చు చున్నవి. పువ్వులు సువాసన వేయును. దీనికాయలను తిందురు. వీనిలో, పువ్వులలో నుండు ఆకు పచ్చని రేకులు కూడ బెరిగి కండకట్టి, కాయనావరించు కొనుచున్నవి. ఉవ్వకలపయు గట్టిగా నుండు. దీనిని దరుచుగా దుపాకులకుపయోగించెదరు.
చంపక కుటుంబము.
ఈ కుటుంబములో జెట్లను గుబురు మొక్కలునుగలవు. ఆకులు ఒంటరి చేరిక, బిరుసుగానుండును. సమాంచలము, లేతాకులకు గణుపుపుచ్చములుగలవు. ఇవి ఆయాకులునెం