507
ఈగడ్డిమొక్క మీద వేసిచూచెను. అచ్చట అది గడ్డి మొక్క మీద నున్న బూజు వలెనే బెరిగెను. ఇట్లు ఈ బూజు కొంత కాల మొక మొక్క మీదను మరి కొంత కాలము మరి యొక మొక్క మీదను బెరుగు చున్నది.
కుక్కగొడుగు బూజుని ఈ బూజు వలెనే దదులు గదులుగా నుండును. కుక్కగొడుగునకు బూజెక్కడందు రేమో, అది కూడ బూజు మూలమున నేర్పడినది. అది వృక్షమునకు కాయ ఎట్టిదో బూజులకది యట్టిది. ఇదియే సిద్ద బీఅములను భరించును. కాయలో గింజలుండినట్లు దీనిలో సిద్ధ బీజములున్నవి. దాని కాడలను చీల్చి చూచిన యెడల బూజు వలె నుండుట స్పష్టపడును. అది మెదట బూజు నంటి పెట్టుకొని పెరుగు చున్నది. మొదట కాడ అడుగు భాగమును గుండ్రని తలయు గలసియుండును. కాని మధ్య నున్న కాడ ఎదుగుట చేతను ఇతర కారణముల వలనను అది విడి ఎదుగును. దాని అడుగు వైపున గొడుగు బెత్తములున్నట్లు చాల రేకులవలె గలవు. వీని మధ్యనే సిద్ధబీజాశయములున్నవి. కాడలోను పైనున్న అతంతువులు లోపలనున్న తంతువు లొకతీరును లేవు.