506
ఆకులమీదనున్న పచ్చనిచారలు దోదుమ వర్ణముగ మారుటయు దాని నుండియు సిద్ధ బీజములు వచ్చుటయు జూచినదే కాని, మొదటివియు నివియు నొకటేనా యను సందియముమాత్రము కలుగును. ఈ సిద్ధ బీజముల కవచము మిక్కిలి దట్టముగ నున్నది. మరియు నివి రెండేసి కలసి యేర్పడి నట్లున్నవి.
మరియు నివి గోదుమమొక్కల మీద తిరిగి బూజుగా నేర్పడునేమో యని జూచిరి గాని, గోదుమాకుల మీద నెన్ని దినములుంచినను చలనము లేదు. కానీ మొదటిదియు, నిదియు నొకటి కాదని చాల మంది నమ్మి యుండిరి.
గోదుమచేలట్లు ధ్వంశమగుచుండగా, దగ్గిరనొకజాతి గడ్డిమొక్క యున్నచో పైరునకు తెగులు పూర్తిగ బట్టునని రైతులు నమ్మి యుండిరి. అది పరమ చాందస మని కొందరు ఎగతాళి చేసిరికాని, అట్లగుట స్పష్ట పడియెను. అందు చేత అప్పుడు గోదుమ చేలకు దాపున నట్టి గడ్డి దుబ్బల నుంచ రాదని ఇంగ్లాండు నందు రాజాజ్ఞ యు గలిగెను. నిజముగా నీగడ్డి మొక్కలందు కూడ బూజుగలదు.
ఈసంగతంతయు నెరిగిని యొకవృక్షశాస్త్రవేత్త గోదుమమొక్కల మీద గలిగిన రెండవరకము సిద్దబీజములను