501
ఒక్కకప్పుడు బంగాళదుంప కుళ్ళి నల్లబడుట గనుచున్నాము. దానికి ఇట్టి బూజే కారణము. ఈ బూజు మొదట ఆకులలో ప్రవేసించి మాను ద్వారా దుంపలలోనికి దిగును. దుంపలు ముదురువై పైచర్మము గట్తిగా నున్నచో లోపల ప్రవేసింప లేవు గాని లేత వానిలో ప్రవేసించును. కొట్లలో నిలువ యుంచిన దుంపలు కుళ్ళుట కొట్లులోనున్నపుడు బూజు పట్టుట చేతనే గాదు, ఆదుంపలలో నదివరకే బూజు ప్రవేసించియున్నది.
ఈబూజుబాధ వదల్చుకొనుట సులభముకాదు. కొన్ని రకముల దుంపల చర్మము దళసరిగా నుండును. వానిలోనికి బూజు సులభముగ ప్రవేసింపలేదు. కాన అట్టి వాని నేరి వానితోడనే సేద్యముచేయుట మంచిది. బూజు చచ్చునని సున్నము, గంధకము మొదలల్గు వానిని జల్లుట వలన లాభమంతగా నున్నట్లు తోచదు. ఇవి యొకప్పుడు బూజునే కాకుండ మొక్కలను కూడ నాశనము చేయును. ఈ బూజు ఆకుల ద్వార ప్రవేసించును గావున నిది చేరి నట్లు చిహ్నములు దోచగనే ఆకులను త్రుంపుట మంది దగుట నిజమే. కాని, మొక్క కంతయు ఆహారపదార్థము ఆకులమూలముననే ఏర్పడుచున్నది. ఆకులను త్రుంచి వైచిన ఇక ఆహార మెట్లేర్పడును? ఇట్ల