పుట:VrukshaSastramu.djvu/505

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

502

బూజు సిద్ధబీజములున్న చేలలో ఆబూజునకు సరిపడిని మరియొక పైరును జల్లుట మంచిది. లేదా, కొంత కాలము వరకు అచ్చట ఏమియు జల్ల కుండినను మంచిదియె. ఈ లోపున సిద్ధ బీజములు బూజుగ పెరిగి ఆహార పదార్థమేమియును దొరకమిచే నశించి పోవును. ఇంతకు నశింప కున్నచో ఒకప్పుడు పొలములో నంతటను మంటవేయుదురు.

కొన్ని జాతులబూజులందు కొన్ని ఊద్ర్వతంతువులు రెండు రెండు దగ్గరగా వచ్చి, వాని చివరలు పెద్దవై గుండ్రముగా నగును. వాని లోపల నొక గోడ యేర్పడుచున్నది. పిమ్మట నీ తంతువుల చివరల రెండు గలిసి కొని, ఒకదానిలోనికి బోవును. కావున మొదటి దానిని పురుష తంతువుగను, రెండవానిని స్త్రీ తంతువుగను నెన్ను చున్నాము. తరువాత నా మిళితమైన దాని నుండి తంతువులు బైలు దేరును. లేదా పలువలు సిద్ధ జీజాశయములు కూడ ఏర్పడును.

మరి కొన్ని బూజులలో స్త్రీ పురుష వివక్షత తగ్గి పోయినది. వీనిలో గొన్నిటిబీజములు సంచుల వంటి వానిలో నుండును. ఒక్కొక సంచియందు సారారణముగ ఎనిమిదియుండును. కాని యన్నడు ఎనిమిదికం టె ఎక్కువయుండవు. ఈ బూజులలో సిద్ధబీజాశయముల కూడ గలుగుచుండును. ఈ సిద్దబీ