500
క్కలలో కూడ బూజుపట్టుటగలుగుచున్నది. ఈబూజెక్కడ నుండి వచ్చును? ఒక వేళ గింజలలోనె యుండిన నుండ వచ్చును. కాని సాధారణముగ భూమిలో నుండియే వచ్చు చున్నది. భూమిలోనుండి యప్పటి కప్పుడు పుట్టుట లేదు కాని ఎండ దెబ్బల కాగుట కదివరకే ఏర్పాటు గావించుకొని యున్నది. నీరు సమృద్ధిగ నుండ నపుడు మరి యొద విధముగ సిద్ధ బీజముల నేర్పడును. ఊర్థ్య తంతువుల కొనలు వెనుకటి రీతినే లావై మూళ పదార్థమును చేర్చును.
ఈ తంతువులలో మగ, ఆడు భేదములు గలుగు చున్నవి. ఈ కొనలందుండు గదులలో మొదటి పలు జీవ స్థానములుండగాని సంగమమునకు పూర్వమెక్కటియే యుండును. ఇది స్త్రీ తంతువు. ఇది యట్లుండగ దగ్గరగా నున్న మారియొకటి కూడ చివర నొక గది నేర్పరుచు కొనును. ఇవి రెండును దగ్గరగా వచ్చి కలిసి కొనును. రెండ వాని నుండి ఒక గొట్టము వంటి దేర్పడి దాని ద్వార మొతడి దానిలోనికి మూల పదార్థమును జోవ స్థానమును బోయి యచ్చట నున్న జీవ స్థానముతో కలియును. అట్లు గలసిన పిమ్మట వెంటనే దాని నుండి తంతువులైన పుట్టును లేనిచో, పెరుగుట కంత వీలుగ నుండస్ని యెడల చాల కాలము పెరుగకయే, నీళ్ళు లేకున్నను చచ్చి పోక బ్రతి యుండును. ఇట్లు దాగి యుండి అవకాశము చిక్కి నపుడు తిరిగి పెరుగును.