499
కొను పొడియు వీనిదే. ఇట్లేర్పడు సిద్ధబీజములకు చూర్ణ భీజములని పేరు.
ఆవాలు మొదలగు కొన్ని విత్తుల నొత్తుగ జల్లి నీరు విస్తారము బెట్టినచో ఒక్కొకప్పుడు లేత మొక్కలు వాడి పోవుట తటస్థించును. అట్టి దాని నొకటి దీసి పరీక్షించితిమా, ఆకులు, వ్రేళ్ళు సరిగా నుండును గాని, మొక్క అడుగున తిని వేసి నట్లు కనబడును. మొక్క వాడి పోవుట కదియే కారణము. అచ్చట బూజు ప్రవేశించి మొక్కను తిని ధ్వంసము చేసినది. దానిలో తంతువులు పైన చెప్పిన విధమున చూర్ణ బీజములుగ నేర్పడు చున్నవి.
అట్లు కానిచో కొన్ని తంతువుల చివరల లావెక్కును. దానిలోనికి మూల పదార్థము మెండుగ చేరును. పిమ్మట వాని నుండి గసిక వలె నొకటి బయలు దేరి క్రమక్రమముగ గుండ్రముగా నగును. ఇదివరకు కొనలోనికి చేరిన మూల పదార్థము ఇందులోనికి ప్రవేసించి చిన్న చిన్న భీజముల క్రింద విడుచును. వీనికి రెండేసి మృథు రోమములు కూడ గలవు. ఇవి మృదు రోమ బీజములు. ఈ మృదు రోమముల మూలమున నీదులాడుచు పోయి ఎతర మొక్కలను చేరి పెరిగి నాని నట్లే ధ్వంసము చేయును. ఒకప్పుడు చాల కాలము పొలము ఎండ తట్టి తరువాత జల్లిన విత్తనముల మొ