పుట:VrukshaSastramu.djvu/501

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

498

మరికొన్నిటిలో మధ్యనొకగోడమైననులేదు. కొన్ని పొడుగుగానె యుండును. మరి కొన్ని చీలి రెమ్మలుగా నుండును. ఈ రెమ్మలును కొన్ని సన్నముగాను కొన్ని గుండ్రముగాను, కొన్ని మేకుల వలెను నుండును. ఆహార పదార్థమును నంటుకొనిటయే, కణకవచముల ద్వార జొచ్చి ఆహార ము కొని వచ్చుటయో నూనె కొవ్వు వంటి వానిని నిలువ చేసి కొనుటయో వీని పని. ఈ తంతువులలో నాకార భేదమంతగా లేదు. కొన్ని లావుగను కొన్ని సన్నముగను, కొన్నిటి గదులు దగ్గిరిగను, కొన్నిటివి దూర దూరముగను నుండును.


బూజులో నిలువుగ లేచిన ఆ తంతువులు సిద్ధబీజములు కానున్నవి. ఇవి విత్తనముల వంటివి. ఇవెక్కడ రాలిన అక్కడ బూజుగ బెరుగును. తంతువులు పైకి పెరిగిన తరువాత వాని చివర నొక గోడ ఏర్పడి దది వలె నగును. దానిలో మూల పదార్థము చాల గలదు. అట్లు గది యేర్పడిన పిదప నురివేసి నట్లు క్రింద సన్నగిలి, తెగి రాలి పోవును. లేదా, అది యట్లుండగనే దాని క్రింద నీరీతినే మరికొన్ని ఏర్పడును. ఒక్కొక్కప్పుడు గది యేర్పడిన తరువాత దాని మీద పలువ లేర్పడి, అపలువల మీద పై ప్రకారంమేర్పడు చుండును. ఇ వేర్పడునపుడే బూజునకు పలురంగులువచ్చును. మనచేతికంటు