Jump to content

పుట:VrukshaSastramu.djvu/500

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

497

మీదను, చెప్పుల మీద, పురుగుల మీద, అన్ని చోట్లను నివి పెరుగ గలవు. బూజు చూటుటకంత నొక రీగిగ నున్నను దాని లోను చాల జాతులు గలవు. కొన్ని యెచ్చట నైన పెరుగ గలవు. కొన్ని జీవ పదార్థములు మీదనే గాని పెరుగ జాలవు. మరి కొన్ని పురుగుల మీదనే గాని జీవింపలేవు. బూజులో కొన్ని జాతులు సదా పరాన్న భుక్కులే. అనాగా నితర ప్రాణుల మీద మొలచుచు అవి సంపాదించుకొనిన ఆహారమును దినును గాని తాము పాటు పడి సంపాదించు కొన లేవు. మరి కొన్ని చచ్చి కుళ్ళు చున్న పదార్థముల మీదను తోలు మొదలగు నొకప్పుడు సజీవములైన పదార్థముల మీద గాని పెరుగ లేవు.

బూజును కొంచెము తీసి సూక్ష్మ దర్శినితో జూచిన యెడల నూలు పోగులవలె సన్నముగను, పోగులు పోగులుగను అగు పడును. ఈ పోగులకు తంతువులని పేరు. ఈ తంతువులలో కొన్ని అహార పదార్థము నంటి కొని దానిపై బడి యున్నవి గాని మరికొన్ని పైకి లేచి యున్నవి. పైకి లేచిన వానికి ఊర్థ్వ తంతువులనియు, అడుగున నున్న వానికి నదస్తంతువులనియు పేరు. కొన్ని తంతువులలో గదులు గదులుగనున్నవి.