పుట:VrukshaSastramu.djvu/486

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

482

గలదు. వేసవి కాలమందు వానిని ధనికులు కొని ద్వారములకు కిటికీలకు కట్టు కొందురు.

నాగ సరము. ఎనిమిది మొదలు పండ్రెండు అడుగులెత్తు పెరుగును. ఆకులు వంకరగా ఖడ్గము వలె నుండూ. అల్ప కణికము లొక్కొక చోట ఒక్కొక్కటియే గలదు. వీనిలో కింజల్కములు రెండు. నాగ సరపు కడలతో పిల్లంగోరులను పాముల వాండ్లూదు నగ స్వరముల గొట్టములను చేయుదురు.

దూర్వాలు ప్రతిచోట మొలచు చున్నవి. ఇవి భూమిమీద ప్రాకుచునే యుండును. పువ్వులు పూచు కాడ ఆరంగుళములు మొదలు అడుగెత్తు వర్కు లేచును. ఇది పవిత్రమైన గడ్డి, విఘ్నేశ్వరునకు ప్రీతికరమని దీనితో పూజ సేయు చుందురు.

దర్భ గడ్డి కాడలు అడుగు మొదలు మూడడుగులెత్తు వరకు మొలచును. ఇదియు పవిత్రమైన గడ్డియే. దీనినన్ని బ్రాహ్మణ కార్యములందు ఉపయోగింతురు.

రెల్లుగడ్డి కాలువగట్లుమీదను తేమ గానుండు స్తలములలోని పెరుగును. అది సాధారణముగ 5 మొదలు పది అడుగులవరకు పెరుగును కాని మంచి భూమియైనచో 15 అ