పుట:VrukshaSastramu.djvu/485

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

481

సాధాన్యపవెదురు ఎబది అడుగుల ఎత్తు పెరుగును. ఇది గుల్ల వెదురుగాదు. దీనితో బల్లెములు, అమ్ములు, గొడుగు కామము, కుర్చీలు చేయుదురు.

గొడుగు కామ వెదురు. ఇరువది యైదు మొదలు నలుబది అడుగులెత్తు పెరుగును. ఇవి బర్మా దేశములో విస్తారముగ గలవు. కొన్ని మిక్కిలి సన్నముగ నుండును. కొన్ని ఇతర చెట్లు యాధారము లేకుండ బెరుగ లేవు. ఇవి బుట్టలు సంచులు అల్లుటకు చాల వీలుగ నుండును.

వెదుళ్ళలో నింక ఎన్నో రకములు గలవు. కొన్ని చాల లావుగ నుండును. వానిని బండ్లకు ఉపయోగించెదరు. కొన్నిటితో తవ్వలు, సోలలు కూడ చేయుదురు. కొంచెము సన్నముగా నున్న వానిని చెరుకున కాధారముగ నుండు నట్లు చెరుగు తోటలందు ప్రాతుదురు.

వట్టివేరు నీటితీరమున బెరుగును. ఆకులుసన్నముగ పొడుగుగనుండును. అల్ప కణిశములు జతలు జతలుగ నుండును. వేళ్ళు సన్నముగను గోదుమ వర్ణముగను నుండును. ఎండు వానిని తడికలుగ కట్టి అమ్ముదురు. వానికి సువాసన