పుట:VrukshaSastramu.djvu/478

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

474

చుండవలెను. తరువాత ప్రతి పదునైదు దినములకును తడి పెట్టుచుండ వలెను.

చెరుకునకు, చేప పెంట, పేడ ముఖ్యమైన ఎరువులు. తెలక పిండి, ఆముదపు తెలక పిండి మొదలగునవి మధ్యమములు. ఎముకలు మొదలగునవి మూడవరకము. చెరుకునకు తెగుళ్ళు కలుగుట కూడ కలదు. ఆకుల లోను, గడలలోను బూజు పట్టి ఎర్రని చుక్కల వలె నగుపడును. కొన్ని పురుగులు వానిని తొలిచి తిని వేయును. ఎలుకలు నక్కలు కూడ వానిని ధ్వంసము చేయు చుండును.

ప్రతి సంవత్సరము నొక చోట చెరుకు వేయుట కంటే సంవత్సరము విడిచి సంవత్సరము వేసిన మంచిది. కాని కొన్నిచోట్ల చెరుకు గడలను పూర్తిగ పెరికి వేయక వాని మొదల్ళునుంచెదరు. అవి మరుసటి సంవత్సర మెదిగి పంటకు వచ్చును. కాని ఏటేటికి సారము తగ్గి పోవును.

చెరుకుల లోను చాల రకములు గలవు. కొన్ని చిన్నవిగానే యుండును. కొన్ని చాల పెద్దవి. కొన్ని తినుటకు వీలుగాను మెత్తగాను నుండును. కొన్ని ఎర్రగా నుండును. కొన్నిటిపై దగ్గర దగ్గర చారలు గలవు.