పుట:VrukshaSastramu.djvu/479

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

475

చెరుకు కర్రలను కోసి గానుగులలో పెట్టి ఆడుదురు. ఈ గానుగలు నూని గానుగులవలెనుండవు. ఇంచు మించు డోలంత లావున, అంత పొడుగున రెండు ఇనుపవి యుండును. అవి నున్నగా నుండక అంచులు అంచులుగా నుండును. వాని మధ్యను ఒక్కొక్క మారు మూడు నాలుగు గెడలను పెట్టు చుందురు. కారెడు రసమంతయు అడుగున వున్న కుండలో పడు చుండును. ఏడెనిమి కుండల రసము వచ్చిన తరువాత దానిని పెద్ద పెనములలో పోసి కాచి బెల్లము వండుదురు. కాచుటకు చెరకు పిప్పియే పనికి వచ్చును. అందులోని మురికి పోవుటకు సున్నమునో, పాలనో చమురో, జిగురో వేసెదరు. మురికి పైకి తేలగనె దానిని దీసి వేయుదురు. బెల్లమునకు సున్నమెక్కువైన కొలది గట్టి వచ్చును. ముదరగాగ మునుపే చెరుగు పానకము దీసి దాని తోడను పటికబెల్లము వండుదురు.

యంత్ర శాలలందు చెరుకును పలుచగను అయిమూలగను ముక్కలు ముక్కలు క్రింద యంత్ర సహాయమున జీల్చెదరు. ఆ బ్రద్దలను వేడి నీరున్న మరియొక దానిలో పెట్టగ చెక్కెర యంతయు నీటిలోనికి దిగును. ఈ విధమున చేయుట వలన గానుగాడిన దాని కంటె ఎక్కువ చెక్కర వచ్చును. దినిని సున్నము తోనైనను పాలతోనైన కాచి శుబ్ర పరచెదరు.