Jump to content

పుట:VrukshaSastramu.djvu/477

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

473

వర్గలు నాలుగడుగులెత్తువరకుపెరుగును. వానిమీద రోమములు గలవు.

వీనిని అన్నము వండుకొని తిందురు. కొన్ని దేశములందు వివాహాది శుభ కార్యము లందు వర్గులను పాలు పంచ దార కలిపి వండక మానరు.

చెరుకు
- మన దేశమునందంటటను సాగు చేయు చున్నారు. పంచ దార బెల్లము నిచ్చు మొక్క లితరములున్నని మన దేశములోనిదియే ముఖ్యము. మన రాష్ట్రములో చెరుకు బళ్ళారి, కడప అనంతపురము, గోదావరి, విశాఖ పట్టణము, ఆర్కాటు, కోయంబత్తూరు, సేలము జిల్లాలలో ఎక్కువగ పండు చున్నది. చెరకు పంటకు సంవత్సరమునకు పది మాసములు నీరు సమృద్ధిగ నుండవలెను.

చెఱుకు గడలనుగాని పైనుండు దవ్వ వంటి ముక్కలను గాని మూరెడు మూరెడు ముక్కలుగా కోసి, నిలుగ పాతిపెట్టక, పడుకొన బెట్టి పైనున్న మన్ను గప్పుదురు. కొన్ని చోట్ల అట్లు పాతుటకు పూర్వము గోతులు దీసి, వానిలో గడ్డి పరచి, దానిమీద ముక్కలను బెట్టి తడిగడ్డి కప్పి వారము దినములుంచెదరు. మొదటి నెలలో వారమున కొన నాడు నీరు పోయు