ఈ పుట ఆమోదించబడ్డది
464
యేగాక బల్లలతో కొట్టుట వలన కూడ జరుగు చున్నది. వరినంతయు రెండు ముఖ్య భాగములుగ విభజింప వచ్చును. పెద్దవరులు, దాళవాలు, పెద్ద వరులలో సాధారణముగ ఆట్ర కడాలను జల్లుదురు. దీనిపంటకు నీరుచాలకాయలయును.
- కొసార్లు
- - కొంచెముపచ్చగా నుండును. వీని గింజలు చిన్నవి. వీని నంతగా సేద్యము చేయుట లేదు.
- కృష్ణ నీలాలు
- - ధాన్యము చిన్నవి. కొంచెము నీలపు వర్ణము గలదు గాని బియ్యము తెల్లగానే యుండును. ఈ బియ్యము సన్నముగా నుండును. వీనిని తరుచుగా ఆవిరి మీద వండుదురు.
- బంగారు తీగలు
- - సువరములు, కృష్ణ కాటుకలు, కొణామణులు, అక్కుళ్ళు, ప్రయాగలు, రత్న భోగములు మొదలగు పెక్కురకములు గలవు.
దాళవాలపంట పెద్దవరిపంటకంటె తక్కువ కాలము పట్టును. ఇవి తినుటకంతగా బాగుండవు. కాని బీద సాదలును ఉప్పుడిబియ్యమునకును వీనినుపయోగించు చున్నారు. వీనిలోను, గౌరికుంకాలు కొడమలు, బుడమలు, మొదలగు పెక్కు రకములు గలవు.