పుట:VrukshaSastramu.djvu/467

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

463

భూసారమును బట్టియు నుండును. మిక్కిలి సారవంతమగు నేలల మీద కొన్ని రకముల వరిని మూడు పంటలనైన పండించ వచ్చును. వీని పంట కిట్లు చేయు చున్నారని చెప్పుట కస్టము. పలువురు పలు విధములుగా చేయు చున్నారు. కొందరు పొలము దున్ని విత్తులు వెద జల్లు చున్నారు. కొందరు ఒక పంటకు వెద జల్లి రెండవ పంటకు ఆకు పోసి ఊడ్చు చున్నారు. కొన్ని చోట్ల ఆకు మళ్ళు జల్లి ఊడ్చిన గాని పంట పండుట దుర్ఘటము. వర్షములకు కొంచము ముందు కొంచ మెత్తు గా నున్న చెక్కలలో నాకు జల్లెదరు. ఆకుమళ్ళకు నీరు విస్థారముగ నున్న యెడల నది పోవుటకును, తక్కువగా నున్న యెడల నీరు పెట్టుటకును వీలుగ నుండ వలెను. విత్తనములు త్వరగ మెలకెత్తుటకు వానిని జల్లుట కొనదినము ముండు వానిపై కొంచము నీరు జల్లి గాలితగల కుండ కప్పుదురు. లేదా వానిని బస్తాలలోపోసి ఒక రాత్రి వానిని చెరువులోనో కాలువలోనో నాన బెట్టుదురు. ఆకు బాగుగ నెదిగిన పిదప దానిని దీసి దున్ని, గమ్ము చేసిన పొలములో నూడ్చెదరు. వరిపంటయు రకమును బట్టియుండును. కొన్ని మూడు నెలలకె పంటకు వచ్చును. కొన్ని చాల ఆలశ్యముగ పంటకు వచ్చును. చేను కోతకు వచ్చు నప్పటికి అందు నీరుండ రాదు. చేనుకోసి కుప్పలు వేసి నూర్చెదరు. ఈ నూర్చుట ఎడ్లచే తొక్కించుట