462
ఇవన్నియు చిన్నమొక్కలే. ఎత్తుగా పెరుగునవి చెరకు,. ఎదురు మాత్రమే. వీనికి సాధరణముగ మూల వహములుండును. అందు చేతనే గడ్డిని పైపైన చెక్కి వేసిన మరల త్వరగా పెరిగి వచ్చు చుండును. వీనికి కొమ్మలు తరుచుగా నుండవు. పుష్పములు చాల మార్పు చెంది యున్నవి. పువ్వుల రేకులు లేవు. రక్షక పత్రములు లేవు. పువ్వులు కొన్ని సపుంసకములు. కొన్ని మిధునములు. కొన్ని ఏక లింగ పుష్పములు. అండాశయము ఒక గదియె. వీనిలే గొన్నిటికి యందు చిట్ట చివర నున్న తుషములో సదా ముధున పుష్పముండును. వరి కొన్నిటి యందు చిట్ట చివర సదా పురుష పుష్పమో, నపుంసక పుష్పమో యుండును. ఈ లక్షణమును బట్టి ఈ కుటుంబమును రెండు ముఖ్య భాగములుగ విభసించి యున్నారు.
వరి ప్రపంచములో కెల్ల మన దేశములోనె ఎక్కువగా పండు చున్నది. మన దేశములో సాగగు 20,76,83, 741 ఎకరములకును 7,34,00,522 ఎకరములు వరి పంట క్రింద నున్నవి. హిందూ స్థానము కంటే మన రాష్ట్రములోనే ఎక్కువ పంట గలదు. 66,04,400 ఎకరములు వరి పండు చున్నది.
వరిలోపలు రకములుగలవు. నాలుగువేల రకములకు తక్కువ లేవు. వీని సేద్యము రకమును బట్టియు