Jump to content

పుట:VrukshaSastramu.djvu/465

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

461

ప్రకాండము మూడు నాలుగడుగులెత్తు పెరుగును. ఇది సన్నము గాను కొంచెము నాలుగు పలకలుగాను నుండుడును. కణుపుల వద్ద మాత్రము గట్టిగ నుండి మిగిలినినచోట్ల బూలగ నుండును.

ఆకులు లఘుపత్రములు. ఒంటరి చేరిక. పాద పీఠము గలదు. ఇది ప్రకాండమును జుట్టికొని యుండును. పత్రమును పాద పీఠమును గలియు చోట పొలుసు వంటిది యొకటి గలదు. పత్రము సన్నముగా నుండును. సమ రేఖ పత్రము. సమాంచలము కొన సన్నము.

పుష్ప మంజరి
- కొమ్మల చివరలనుండి రెమ్మ కంకులు. వీనిలోను తుంగ మొక్కలందు వలె నల్ప కణికములు గలవు. వీనిలోను, పుష్ప కోశము, దళ వలయము లేదు. అల్ప కణికములలో తుషములు గలవు. కొన్ని తుషముల కెదురుగ, నట్టివియే, అంత కంటె పలుచని గలవు. వీనికి బుసమని పేరు. ముఖ్యముగగు పుష్పాంగము లీ రెండిటికి మధ్య నుండును. అచ్చట కింజల్కములు అండ కోశమే గాక దళసరి గా నున్న పొలుసుల వంటివి రెండు గలవు. వీనికి ఉన్మద్రకము లని పేరు. వీని మూళముననే తుషము బుసము విప్పారును. ఒకయల్ప కణిశములో మూడు తుషములుండును. మూడవ తుషమునకే బుసము గలలదు. వీని మధ్య పుష్పము గలదు.
కింజల్కములు ఆరు. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండ కోశము. అండాశయము ఒక గది. ఒక అండము, కీలము రెండుగా చీలి యున్నది. కీలాగ్రము పక్షి రెక్కవలెనున్నది.

అన్నికుటుంబముల కంటెను తృణకుటుంబమే పెద్దది. ఈ కుటుంబపు మొక్కలు ప్రపంచమంతటను గలవు.