పుట:VrukshaSastramu.djvu/464

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

460

రక్కిసతుంగ తుంగలలో నెల్ల పెద్దది. అదిచెరువులోను, నిలకడగ నున్న నీళ్ళలోను ఇరువది అడుగులెత్తు వరకు పెరుగును. ఆకులు కూడ అంత పొడుగుగానుండును. దీని పుప్పొడి తిత్తుల పైన కాడ యొకటి గలదు.

కుషతుంగ చిన్నది. సార వంతమగు చోట్ల గాని మొలవదు. పువ్వుల కంకులలో నొక దానికి కాడ లేదు గాని రెండింటికి గలదు.

గుఱ్ఱపు చెక్క తుంగ ఉప్పు నీళ్ళలో మొలవలేదు. వేళ్ళు దుంపలుగా నుండును. ఆకులును చాల గలవు.

లొట్టి పిట్ట అల్లి మంచి నీళ్ళ చెరువులలో నుండును. కాడ పొడుగుగానే యుండును. కాని ఆకులు చిన్నవి. గింజలు తెల్లగానుండును.

అల్లికవేళ్ళు దుంపలవలె నుండును. ఆకులు గుండ్రము గాను నున్నగాను నుండును. దీని దుంపలను కూరవండుకొని తిందురు.


తృణ కుటుంబము.


వరిమనకు ముఖ్యాహార పదార్థముగాన వానిని విస్తారము సాగు చేయు చున్నాము.