పుట:VrukshaSastramu.djvu/469

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

465

ధాన్యము సగమువండి చల్లార బోసి దంపినచో నవి ఉప్పుడు బియ్యమగును. అవి పేద వారు తప్ప మన దేశములో ఎవరు దినరు. కాని ఎగుమతి అగునవి విస్తారము. ఉప్పుడు బియ్యమే. ధాన్యము నుండి బియ్యము చేయుట కిప్పుడు మరలు గలవు. కాని మర బియ్యముకంటె దంపుడు బియ్యమునే మనమెక్కువ వాడు చున్నాము.

ఇదివరకు పై కెగుమతియగు ధాన్యముమీదబన్ను కలదు. 1875 సంవత్సరమునుండి నీలి, లక్క, నూనె, ధాన్యము, మొదలగు వాని మీద పన్నుండెడిది గాని, కొన్ని సంవత్సరములైన తరువాత ధాన్యము మీద నుంచి ఇతర వస్తువులపై పన్ను దీసి వేసిరి. ప్రపంచములో చాల దేశములకు మన దేశము నుండియే, ధాన్యమో, బియ్యమో, పిండియో ఎగుమతి అగు చున్నవి.

ధాన్యము దంపగా వచ్చు తవుడు చిటు పశువులకు ముఖ్యాహారము. ఊక కంసాలి వాండ్రకు అవస్యకము.

గోదుమలను ఐరోపాదేశస్తులంత విశేషముగ మనము వాడక పోయినను మన దేశమునందును చిరకాలమునుండి సేద్యము చేయు చున్నాము. గోదుమల పంట విస్తారముగ హిం