440
గా నుపయోగించుచున్నారు. ఈ నారను పైదేశములకు పంపి కొంచెము లాభము పొంది సంతసించుటయే గాని, వానితో నేయే సాధనముల నెట్లు చేయుటో మనకు తెలియ రాకున్నది.
త్రాటి మానుకు చేవ గలదు. దానిని ఇండ్ల దూలములకు స్థంభములకు వాసములకు వాడుదురు. అది నీరు తగల కుండ నున్నంత కాలము మిక్కిలి గట్టిగానుండును. ఆకులతో ఇండ్ల కప్పులు దడులు, పందిళ్ళు తట్టుకొను చున్నాము. వీనితో గొడుగులు, బుట్టలు, చాపలు, దొర టోపీలు, కూడ చేయుదురు. పూర్వ కాలమునందు తాటి ఆకుల మీదనే వ్రాసెడి వారు. ఇప్పటిని కొందరు వర్తకూ, పద్దులు మొదలగునవి వాని మీద వేసి కొందురు. ఆకుల మీద నుండు పువ్వారము రక్తము వచ్చు తోట రాసిన రక్తము కట్టును. పువ్వుల కంకి పై నుండు మట్టను కాల్చిన బూడితతో కడుపులో బల్ల బెరుగుట, మొదలగు కొన్ని జబ్బుల ఔషధము చేసెదరు. తాటి ముంజెలను వేళ్ళును చలువ చేయును. తాటి పండ్లను దినుట ద్విజులకాచరము గాదు. వీని రసముతో మామిడి తాండ్ర వలె తాండ్ర చేయుదురు. తాటితేగలనుసాధారణముగ అందరు తినుచున్నారు.