441
తాటిచెట్లనుండి కల్లు మెండుగావచ్చును. సుమారేబది ఏండ్ల వరకును కల్లు గీయ వచ్చును గాని మూడెండ్ల కొక మారు మానుట మంచిది. లేనిచొ చెట్లు నీరసించి పోవును. పోతు చెట్ల నుండి కంటె ఆడ చెట్ల నుండి కల్లు ఎక్కువ వచ్చును. కల్లు పులియ కుండ కుండల లోపల సున్నమును రాసెదరు. దాని ద్రవము నుండి బెల్లము, కలకండ వండు చున్నారు. కాని ఇది విస్తారము రాదు. తాటి కలకండ ఔషధములలో వాడుదురు.
తాళవృక్షమని తాడిచెట్టననుచున్నాముగాని ఈ రెండింటికిని భేదముకలదు. తాళ వృక్షముకూడ చూచుటకు తాటి చెట్టు వలెనుండుటచే అభేదముగ నామములు వాడుచున్నాము. కాని తాళపత్రములు తాటిఆకులకంటె కొంచెము గుండ్రముగా నుండును. ఈ వృక్షములలో మగ, ఆడు భేదము లేదు. దీని ఆకులను తాటి ఆకులు పనికి వచ్చు ప్రతి పనికిని ఉపయోగించును. వ్రాయుటకు ఈ ఆకులే బాగుండును. మాను అంత బలమైనదికాదు. కాని దీని నుండి సగ్గు బియ్యము వండ వచ్చును. నారయు వచ్చును. దీనిటెంకలు గట్టిగానుండును. వానికేరంగైనను సులభముగా పట్టును. కాన వానికెర్ర రంగు వేసి పొగడముల వలెగాని తావళములవలె గాని అమ్ముదురు.