439
వచ్చును. జర్మినిదేశములో కొబ్బరినుండి వెన్నవంటి పదార్థము చేయు చున్నారు. ఇది ఎన్నిదినములు నిలువ యున్నను చెడి పోదు.
కొబ్బరి మూత్ర వ్యాధుల వంటి కొన్ని వ్యాధులకు మంచిది. కొన్ని రకముల జ్వరములకు కూడ మంచిదట.
కొబ్బరిపీచుతోకూడ మిగుల వ్యాపారము జరుగు చున్నది. దీనితో బ్రషులు మొదలగునవి చేయు చున్నారు. ముదురు కాయల పీచు కంటె లేత కాయలది మంచిది. కొబ్బరి కాయలను గునపముల తో వలచి డిప్పలను చాల కాలము ఉప్పునీళ్ళలో నాన బెట్టి నార దీయుదురు. కొబ్బరి చెట్ల నుండియు కల్లు గీయుచున్నారు.
తాడిచెట్టు మిక్కిలి ఉపయోగమగు చెట్లలో నొకటి. దీనినుండితీయు పదార్థములలో విస్తారమెగుమతి అగునది నార. దాని వివిధ భాగములనుండియు వేరువేరు రకముల నార వచ్చుచున్నది. ఆకులు మొదళ్ళ యందంటి పెట్టికొని యుండు పట్ట నుండి యొక రకము, కమ్మలనుండి యొకటి, ఆకుల నుండిఒకటి, టెంకలమీదనుండు పీచునుండి యొకటి, మాను నుండి కూడ నొకరకమువచ్చుచున్నది. వీనిని పలువిధములు