ఈ పుట ఆమోదించబడ్డది
436
- కింజల్కములు
- - 6 పుప్పొడి తిత్తులు రెండు గదులు.
- అండకోశము
- - దీని స్థానమున మూడు ముళ్ళ వంటివి మాత్రమె గలవు.
- స్రీ పుష్పములు
- - చాల పెద్దవి. కంకి మీద నొక్కొక్క చోట నొక్కొక్కటియే యుండును.
పుష్పకోశము:- దళవలయము, అసంయుక్తము. 3 గలవు. బిరుసుగా నుండును.
- కింజల్కములు,- ఆరో తొమ్మిదో గొడ్డైన కాడలు గలవు.
- అండ కోశము
- అండాశయము ఉచ్చము. 3 గదులు. కీలాగ్రము 3 కాయలో సాధారణముగ మూడు గదులు పెరుగును.
ఈకుటుంబపుచెట్లులో దేనికిని కొమ్మలులేవు. ఆకులు చివర నుండును. కొన్ని మొక్కలకు ప్రకాండమే లేదు. పేవబెత్తముల వంటివి మరి కొన్ని చెట్ల మీద ప్రాకుచుండును. దీని ఆకులు పెద్దవి. వీని మిశ్రమ పత్రములు. గులాబి, తుమ్మ ఆకు లేర్పడినట్లేర్పడుటలేదు. కొబరి ఈత మొదలగు వానిలో, చిట్టి ఆకునకు, చిట్టి అకునకును మధ్య నుండు సన్నని పొర తెగి పోవుటచే మిశ్రమ పత్రములగుచున్నవి. పుష్పమంజరి కంకి. పుష్పములకు ఉప వృంతములు లేవు. పుష్ప భాగములన్నియు మూడు మూడు చొప్పున నుండును.