పుట:VrukshaSastramu.djvu/441

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

437

సాధారణముగ కింజల్కములారు. అండాశయము మూడుగదులలోను నొకటియే పెరుగు చుండును.

ఈ కుటుంబములో మిగులనుపయోగములైనచెట్లుగలవు.

కొబ్బరిచెట్టు సముద్రమునుండి నూరు, నూటఏబది మైళ్ళ దూరములో గాని పెరుగ జాలదు. ఒక వేళ పెరిగిన అంత ఫలవంతము కాదు. దీనికి ఇసుక నేలలు మంచివి. కాని ఈత ఖర్జూరము మొలచు ప్రతి ఇసుక నేలలోను మొలవలేదు. దీనికి నీరెక్కువ కావలయును. మరియు మిక్కిలి ఉష్టముగాని మిక్కిలి శీతలము గాని పనికి రాదు. విత్తనములకు మధ్య వయస్సులోనున్న చెట్ల కాయలు మంచివి. కొంచెము ముదురు కాయలను కోసి, నెల, నెల పదునైదు దినము లటకపై పెట్టి అడుగడుగు దూరమున పాతుదురు. పాతిన పిదప పురుగు పట్ట కుండ బూడిదను ఉప్పును, జల్లుట మంచిది. కొన్ని చోట్ల నిట్లు పాత కాయలలో నుండి మొక్క దిగువరకు వ్రేలాడ గట్టి అటు పిమ్మట దూర దూరముగ పాతుదురు. ఇట్లు పాతుట వలన మొదట పాత వలసిన శ్రమ తగ్గును. అదిగాక, పుట్టెడు మొక్క బాగుండునో చచ్చి పోవునో తెలియ గలదు. అడుగడుగు దూర్ఫములో మొ9క్కలు మొలచిన అతరువాత వానిని దీసి, 20 == 25 అడుగుల దూరములో గోతులు దీసి వాని