ఈ పుట ఆమోదించబడ్డది
435
ప్రకాండము, కొబ్బరిచెట్టునకంటె కొంచెము సన్నముగాను తిన్నగాగు వుండును. దీని బెరడు నలుపు. దీని మీదను రాలిపోయిన ఆకుల ఆనవాళ్ళు గలవు. దీనికిని కొమ్మలుండవు.
- ఆకులు
- - చెట్టు చివరనే యుండువు. పెద్దవి. లఘు పత్రములు. చివర కొంచము చీలి యున్నవి. పత్రము సమానముగ నుండక, మెరక పల్లములతో నున్నది. మిక్కిలి బిరుసుగా నుండును. సమ రేఖ పత్రము. లేత ఆకు ముణుచుకొని యున్నప్పుడు ఈనెలు మాత్రము ఎండ, గాలుల పాలగుచున్నవి. కాని మిగిలిన భాగము జాగ్రతగనే రక్షింప పడుచున్నది. ఈనెలు ఎంత ఎండకైన ఆగ గలవు. ఆకులలో పువ్వారమను గోధుమ వర్ణముగల పొడి యున్నది.
- పుష్పమంజరి
- - కంకి, ఏక లింగ పుష్పములు. చెట్టులోనె మగ, ఆడు భేదము కలదు. మగ చెట్టు సదా మగపువ్వులను, ఆడు చెట్టు, ఆడు పువ్వులను పూయును.
- మగకంకి
- - మధ్యాగంధమంజరి. కంకి మీద పువ్వులును చేటికలను ఒత్తుగా గలవు. కంకి నుండి అరంగుళము దట్టముగ నొక ముక్క కోసిన యెడల కొన్ని గుంటలగుపడును. ఈ గుంటలలో నుండియే కొన్ని పుష్పములు వచ్చును. వానిలో పెద్దదిపైననుండును. చిన్నది వంగి కొంచెము లోపలగా నుండును. ఒకదానితరువాత నొకటి వరుసగ వికసించును.
- పుష్ప కోశము
- - అసంయుక్తము. 3 రక్షక పత్రములు. సన్నముగాను, బిరుసుగా నుండును. నీచము.
దళవలయము.- సంయుక్తము. 3 తమ్మెలు గలవు.