పుట:VrukshaSastramu.djvu/416

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

412

అల్లము హిందూ దేశమునంతంటను సాగు చేయు చున్నారు. అది ఎర్ర మట్తి నేలలో ఏపుగా పెరుగును. వర్షాకాలమునందు బొలమును దున్ని చిన్న చిన్న గోతులు దీసి వానిలో పేడ వేసి అల్లము ముక్కలను నాటెదరు. నాటిన పిదప పొలమంతయు ఆకులతో కప్పుదురు. మొక్కలు పెద్దవి కాక పూర్వము వర్షములు విస్తారముగ గురుసి నీరు నిలిచెనా అల్లము మురిగి కుళ్ళి పోవును. కాన పొలములో నీరంతగా నిలువ కుండ చూచు చుండవలెను. 7, 8 నెలల నాటికె దుంపలు త్రవ్వుటకు వీలుగ నుండును.

అల్లము నుండియే సొంఠిని చేతురు. అల్లము ముక్కలను నీళ్ళలో నానబెట్టి మట్తిని రాల్చివైచి ఒక అల్జిప్పతో పై చర్మమును కోసి వేసెదరు. దానిని మరల కడిగి మూడు నాలుగు దినములు ఎండలో పెట్టుదురు. మరిక మాటు దానిని చేతులతోడనే రాపాడించి రెండు గంటలు నీళ్ళలో నాననిచ్చి ఎండలో బెట్టుదురు. ఇంకను నెచ్చటనైనను సొంటిని చర్మమంటి పెట్టుకొని యున్నేడల ఒక గోని గుడ్డమీద పెట్టి రాచెదరు.

అల్లముసోంఠి మందులలోచాలఉపయోగపడుచున్నవి. వీనిలో నొకటైన బెక్కు అనుపానములందు గలియు