411
తెదరు వీనిని లోతుగా పాత కూడదు. గింజల మీద మన్ను ఎక్కువగా బోయుచో అవి కుళ్ళి పోవును. విత్తనములు నాటిన యొక సంవత్సరమునకు నొక అడుగెత్తు మొక్కలు మొలచును. వాని నప్పుడు తీసి దూరముగ బాతి పెట్టెదరు.
కాయలెండి పోక మూపే కోసి వేయవలయును; లేని యెడల అవి బ్రద్ధలై గింజలు క్రింద రాలి పోవును. కాని, తరుచుగా నవి పచ్చగా గాక మునుపే కోసి యొక అగోతిలో పాతుదురు. మరునాడుదయమున దీసి, చాపల మీద బోసి ఎండలో పెట్టుదరు. వర్షము మంచు మాత్రము తగుల కుండ వానిని జాగ రూకత బెట్టు చుండవలెను. ఎండ లేక వర్షములే కురియు చున్న యెడల వానిని పొయ్యి మీద బెట్టెదరు. కాయల యందలి నీరు ఇగిరి పోయిన పిదప చేతులతో రాసెదరు. ఆ రాపిడికి తొడిమలు, ముచ్చికలు రాలి పోవును.
ఏలకులు సుగంధ ద్ర్వవ్యములలో ముఖ్యములైనవి. వాని సువాసనకై తాంబూలమునందును, కొన్ని పిండి వంటలందును వాడుదుము. వాని గింజల నుండి తైలమును దీసెదరు. ఏలకపొడి అనుపానములలో బనికి వచ్చుచున్నది.