Jump to content

పుట:VrukshaSastramu.djvu/414

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

410

రవంత మైన నేలయు, దాపుననొకకాలువయు జల్లని గాలియు ఈ మొక్కల కావశ్వకములు.

అడవులలో ఏలక చెట్లు పెరుగు చున్న చోట కలుపు దీసి చెత్త మొక్కలను దగుల పెట్టి నేల బాగు చేసెదరు. ఆ మొక్కల మీద నీడ ఎక్కువ గానున్న యెడల కొన్ని చెట్లలు గొట్టి వేయ వలెను. నీడ అంత ఎక్కువగా లేకున్నను వీని దాపుననున్న నొకటి రెండు చెట్లను కొట్టి వేయుట వాడుక అయి యున్నది. అట్లు వృక్షములను బడగొట్టుట వలన వేళ్ళు పైకి వచ్చి నేల అదురును. అందు చేత మొక్కలకు లాభము గలుగును. పెక్కు చిన్న మొక్కలు పెరుగుట కారంభించును. ఒక వేళ అట్లు మొక్కలు మొలవవని తోచిన యెడల లేత మొక్కలను దెచ్చి అచ్చట పాదుదురు. రెండు సంవత్సరములకు 10 ఆకులు వేసి ఒక అడుగెత్తు పెరుగును. అప్పుడు మొక్కలారడుగుల కంటే దగ్గరగా నున్నచో, వానిని దీసి మరల దూర దూరముగ పాతి పెట్టెదరు. మూడవ సంవత్సరమునకు నాలు గడుగుల ఎత్తు పెరుగును. ఇప్పటి నుండియు కాయలు కాయుట ఆరంభించును. తోటలలో పెంచు నపుడు గడ్డి మొక్కలు లేకుండ నేలను బాగు చేసి, దూర దూరముగా గోతులు దీసి గింజలను గాని, దుంపల ముక్కలుగాని పా