పుట:VrukshaSastramu.djvu/413

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

409

వానికించుక పసుపు రాయుట మనలో ఆచారము. పసుపును స్త్రీలు తమ దేహములకు పూసి కొనెదరు. గడపలకు రాతురు.

రంగుల్లో పసుపు యొక్కఉపయోగము తగ్గి పోయినది. అది స్థిరముగ నుండు రంగు కాదు. మరియు నిప్పుడంత కంటే చౌక రంగులను చేయు చున్నారు.

ఔషధము లందు కూడ పసుపు వినియోగ పడుచున్నది. అది దేహమునకు వేడి కలుగ జేయును.

చెన్న పట్టణము, బొంబాయి, కలకత్తా నుండి పసుపు జర్మినీ, ఇంగ్లాండు, అరేబియా, పెరిష్యా మొద్లగు ఇతర దేశములకు ఎగుమతి అవు చున్నది..

ఏలక చెట్లు కొండలమీదను అడవులలోను 5 మొదలు 8 అడుగుల ఎత్తు వరకును పెరుగును. అవి 500 మొదలు 50,000 అడుగులవరకు ఎత్తుగా నున్న ప్రదేశములందు గాని పెరుగ జాలవు. ఈ చెట్లలో రెండు రకములు గలవు. ఒక దాని ఆకులు సన్నముగా నుండును. వీనిక్రింది పైపునపట్టు వంటి రోమములు గలవు. రెండవ దాని ఆకులు వెడల్పుగా నుండును. రోమములు లేవు. దీని కాయలు పెద్దవి. సా