పుట:VrukshaSastramu.djvu/412

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

808

లో నంతయు బసువునేవేసిన యెడల దిరిగి మూడేండ్ల వరకు నచ్చోట పసుపు వేయరు. వరియో రాగులో వండించుదురు. వర్షకాలము మందు దుంపముక్కలను నాటి చైత్ర మాస ప్రాంతముల దుంపలను ద్రవ్వెదరు. ఎకరమునకు పది మణుగులు వేసినచో రెండువందలమణుగుల వరకు రావచ్చును. (త్రవ్విన పచ్చి దుంపలను నిలువ చేయుటలో మూడు నాలుగు విధములు గలవు. కొందరు పసుపు కొమ్మల నొక కుండలో వేసి మూత వేసి దానిపైన పేడ పూస పూసి, ఉడక బెట్టెదరు. అటు మీద వారము దినములు (రాత్రులందు మంచు దగుల నీయక కప్పుచు) ఎండలో బెట్టెదరు. కొందరు పేడ నీళ్ళలొ ఈ దుంపలను వేసి కాచు చున్నారు. మరి కొందరు కాచకనే నీళ్ళలొ నిమ్మకాయల రసము గలిపి పశుపు కొమ్ముల నానవేసి ఎండపెట్టుదురు. ఎండ బెట్టుటకు బదులు కొందరు తడి ఆరు వరకు పొయ్యిమీద బెట్టుదురు. చాయ పసుపునకు బిండి పసుపునకు బంట యొకటియే రెండు మూడు సార్లు నీళ్ళలో ఉడక బెట్టుట వలన అదే చాయ పసుపగు చున్నది. పసుపునకు చిరకాలము నుండి చాల గౌరవము గలదు. అది పుణ్యాంగనా చిహ్నము ప్రతి శుభ కార్యమునందును నిదియుండి తీరును. క్రొత్త బట్టను కట్టుకొనునప్పుడుకూడ