పుట:VrukshaSastramu.djvu/417

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

413

చున్నది. వీని గుణమూలాయామందులను బట్టియుండును. అల్లమును కూరకాయలందును బచ్చళ్ళయందును కూడ వాడు చున్నారు. దీని నుడి యొక విధమగు సారాయిని చేయు చున్నారు.

మనదేశమునుండి అల్లము, సొంఠియు కూడ ఇతర దేసములకు ఎగుమతి అగు చున్నవి. మన దేశములో పండి ఎగుంతి అగు చుండినను మనకు చీనా, జపాను దేశముల నుండి కూడ అల్లము వచ్చు చున్నది. మరియు మనమెగుమతి చేయు అల్లము పంచ దారతో గలసియు, తేనెతోడ గలసియు, మనకు తిరిగి వచ్చు చున్నది.

పెద్దదుంప రాష్ట్రము. సన్న దుంప రాష్ట్రము కూడ ఔషధములలో పనికి వచ్చును. పెద్దదుంప రాష్ట్రము మనము కొంత చీనా దేశము నుండి కూడ వచ్చు చున్నది. వీని మొక్కల ఆకులనుండి వచ్చు నారతో కొన్నిచోట్ల కాగితములు చేయుచున్నారు.

గంధ మూలిక 3, 3-1/2 అడుగు లెత్తు పెరుగును గాని ప్రకాండము భూమిలోపలనే యున్నది. దీనిపువ్వులు పచ్చగా నుండును. ఎండిన వేళ్ళు ఔషధములోనికి పనికివచ్చును.