పుట:VrukshaSastramu.djvu/409

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

405

లో బొంతయరటి, కొమ్మరటి, చెక్కరకేళి, అమృతపాణి, ఎర్రఅరటి మొదలగు పెక్కు రకములుగలవు. ఈ రకములన్నియు ఒక అడవిరకమునుండి సేద్యభేదము వలన గలిగినవి. సేద్యము చేయు రకములు దుంపలమూలముననే వ్యాపించ బడు చున్నవి. వాని పండ్ల యందు విత్తులు లేవు. బొంత అరటి దాదాపుగా అన్ని నేలలందును పెరుగును కాని మిగిలిన రకములు పెరుగవు. వీనికి సారవంతమగు నేలలుగా వలెను. కాన క్రొత్తగా దోటలు వేయునపుడు చెరువులో బెడ్డ దీసి తోటలలో వేసెదరు. మరియు నీలి రొట్టను బేడను నెరువుగా వేయుచో దోటలకు బలము కలుగును. అరటి చెట్లను దోటలలోనే గాక చేల గట్ల మీదకూడ పాతుదురు. చిన్నచెట్లను పాతిన యొక సంవత్సరమునకు గాపుకు వచ్చును. కెల నుండి కొన్ని కాయలు దిగిన పిదప మిగిలిన పుషములను గోసేసివేయుట మంచిది. అట్లు చేసించో ఆహార పదార్థములాకాయలకే సంమృద్ధిగా బోవును. కాన అవి నీరసముగా నుండక బాగుగ నుండును. అది గాక చివర పుష్పముల నుంచినను లాభము లేదు. అవి పురుష పుష్పములు గాన కాయలు కాయవు. అరటి చెట్టు పుష్పించి యున్నప్పుడు దానినాశ్రయించి చుట్తునున్న చిన్న చిన్న మొక్కలను దీసివేయుట మంచిది. కాయలుపండిన పిదప అరటి చెట్లను నరికి