పుట:VrukshaSastramu.djvu/410

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

406

వేసెదరు. నూరుచెట్లను పైరు చేయుటకు సుమారు 13 రూపాయలు ఖర్చగును. కాని ధర బాగుగా నున్న యెడల 100, 150 రూపాయల వరకు రావచ్చును.

అరటి పండ్లు మిక్కిలి రుచియైనవి. ఇవి మామిడి పండ్లు పనస పండ్లు వలె కొన్ని ఋతువులందే కాక ఎల్లప్పుడును దొరకును. బొంత అరటి కాయలు కూరకే బాగుండును. అరటి గెల చివర నుండు పువ్వును కూడ కూర వండుకొను చున్నాము. కొందరు అరటి కాయలు బలుచగాముక్కలు కోసి ఎండ బెట్టి పొడి చేసి నిల్వ వుంచు కొనెదరు. ఈ పొడుమును కూడ బియ్యపు పిండి, జొన్నపిండి వలెనే వాడుదురు. అరటి స్థంభముల నేనుగులు తిన్నచో వానికి బలము గలుగును. దుంపలను ఆవులకు బెట్టితిమా అవెక్కువ పాలిచ్చును. స్థంభములందముగా నుండుట చే వివాహాది శుభ కార్యములందు బందిళ్ళకు వీనిని గట్టు చున్నారు.

అరటిచెట్ల యుపయోగము పండ్లను దినుట, ఆకులలో భుజిచుటయే గాదు, వాని నుండి విలువైన నారయు దొరుకుచున్నది. నారకు గొండ ప్రదేశములందు బెరుగు చెట్లు శ్రేష్టము నారదీయుటకు చెట్లు పుష్పింపబోవు చుండగా నరికి వేసి, స్థంభములను దొప్పలుగా విడదీసి, మూడేసి