పుట:VrukshaSastramu.djvu/408

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

404

అండకోశము
- అండశయము నీచము సంయుక్తాండాశము 3 గదులు ఒక్కొక గదిలో చాల యండములు గలవు.
కీలము
- సన్నముగా దారమువలెనున్నది. కీలాగ్రము మూడు తమ్మెలుగ చీలి యున్నవి. ప్రతి రెమ్మె మధ్య ఒక సన్నని రంద్రము గలదు.

ఈ కుటుంబపు చెట్లలో నన్నియు గుల్మములే. వీనిలో మిక్కిలి ఎత్తుగా బెరుగునది అరటి చెట్టు. సాధారణముగ వీని ప్రకాండములు మూల వహములు. అండ కోశము నీచము. 3 గదులు గలల్వు. కింజల్కములీ కుటుంబములో మూడు విధస్ములుగస్ నున్నవి . అరటి చెట్టు నందు వలె కొన్నిటి యందు 5, 6 కింజల్కములున్నవి. మరికొన్నిటియందు మెట్ట తామరలో నట్లు కింజల్కములన్నియు ఆకర్షణ పత్రముల వలె మారి పుప్పొడి తిత్తి యొక్క ఒక గది మాత్రము మిగులు చున్నది. అల్లము కచ్చూరము మొదలగు కొన్నిటి యందు రెండు గదులు గల యొక పుప్పొడి తిత్తిగలదు. ఈ భేదములను బట్టి అరటి కుటుంబ ఉప కుటుంబములుగా విభజింప బడినది.

అరటిచెట్లు మన దేశమునందెల్ల యెడల 5, 6 వేల యడుగుల ఎత్తు ప్రదేశములందు కూడ బెరుగుచున్నవి. వీని