పుట:VrukshaSastramu.djvu/396

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

392

పనస పండ్లు రుచిగానుండును. కావున మన దేశములో చాల చోట్లనే చెట్లను పెంచుచున్నారు. పనస తోటల కంతే విశేషముగ పాతు బడ నవసరము లేదు. ఈ చెట్ల ఉండి జిగురు కూడ వచ్చును. దీని పాలు జిగురుగా నుండుట చే వానిని దీసి పిట్టలను బట్టుకొనుటకు ఉపయోగింతురు. దీని కలపయు బాగుగనే యుండును. చిన్న పడవలు, తలుపులు, ద్వారబంధములు మొదలగునవి చేయుటకు బనికి వచ్చును. దీని రంపపు పొట్టును నీళ్ళతో కాచి పచ్చని రంగు చేయుదురు. ఆకులు వేళ్ళు కూడ ఔషధములలో ఉపయోగించును.

గంజాయి చెట్టు చిన్న మొక్క. దాని నుండి నారయు గింజలనుండి నూనెయు, గంజాయి, భంగు వచ్చుచున్నవి గాన నీ మొక్కలను పైరు చేయు చున్నారు. ఇవి మూడు వేల అడుగుల ఎత్తులోపున గాని, ఏడు వేల అడుగుల యెత్తు పైన గాని వర్థిల్లలేవు. ఈ మొక్కలు హిందూస్థానము నందే పైరగు చున్నవి. వీనికి సార వంతమగు నేలలును విస్థారము ఎరువును గావలయును. విత్తులు జల్లినాయిదారు నెలలకు పది పడ్రెండు అడుగులు ఎత్తు పెరుగును. గంజాయి కావల్లెనన్న లేత కాయలను ఆకులను చేతులతో రాచిన వచ్చెడు జిగిరు పదార్థమును బాగు చేతురు. నారకై ఎదిగిన మొక్కలను గోసి కట్టలు కట్టి ఒక దినము ఎండలో పెట్టుదురు. వీనిని కోయుటలో మగ మొక్కలను, ఇరువది ముప్పది