పుట:VrukshaSastramu.djvu/395

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

391

ఈపువ్వులలో గర్భాధానము చిత్రముగ జరుగుచున్నది. కాయ వంటి దాని మీద నొక రంద్రముండుట్ జూచితిమి కదా... ఆరంధ్రము ద్వారా చిన్న చిన్న పురుగులు గుడ్లు పెట్టుకొనుటకు వచ్చును. అవి పొట్టి కీలమున్న అండాశయములోనే గ్రుడ్లు పెట్టును. అ గ్రుడ్లు పెరిగి పెద్దవి పురుగులై పైకెగిరి పోవు నపుడు వాని దేహములకు కింజల్కములు తగులు చున్నవి. పుప్పొడి వాని శరీరము మీద రాలు చున్నది. ఈ పురుగులు మరియొక దానిలో ప్రవేశించి నపుడు వీని పైనున్న పుప్పొడి కీలాగ్రముల పైబడు చున్నది. ఈ రీతిని చిన్న చిన్న పురుగుల సహాయమున గర్భ ధారణా పొందు చున్నవి.

ఇది యొక పెద్దకుటుంబము. దీనిలో పెద్ద వృక్షములు, గుబురు మొక్కలు, గుల్మములు కూడ గలవు. ఆకులు ఒంటరి చేరిక, వానికి కణుపు పుచ్చములున్నవి. కొన్ని చెట్లలో, కొమ్మలందును, ఆకులందును పాలు గలవు. పువ్వులు చిన్నవి. ఏక లింగములు; ఏక లింగ వృక్షములు కూడ గలవు. పుష్పనిచోళము మాత్రమున్నది. కింజల్కములు సాధారణముగ పుష్పని చోళపు తమ్మెలన్నియుండి వాని కెదురుగా నుండును. అండాశయములో నొక గది గలదు. చెట్లయందు పాలు గలవో, లేవో, ఏక లింగ పుష్పములు వేరువేరు చెట్ల మీద నున్నవో, కింఝల్కములు మొగ్గలో వంగి యున్నవో, తిన్నగనే యున్నవో మొదలగు అంశములను బట్టి ఈ కుటుంబమును జాతులుగను తెగలుగను విభజించి యున్నారు. కొందరు శాస్త్రజ్ఞలు ఈకుటుంబము మూడు నాలుగు వేరు వేరు కుటుంబములుగా విడగొట్టియున్నారు.