పుట:VrukshaSastramu.djvu/390

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

386

నిపాలతోనన్నము కలిపి పెట్టుదురు. పుండ్లకు గాని కంటికి గాని ఈ పాలు దగిలినా బాధ పెట్టును.

బొమ్మజెముడు
-. సాధారణముగ కంచెలుగ పెరుగు నాగజెముడు కాదు. ఆకులు లేక, దళసరిగను వెడల్పుగను, ఆకు పచ్చగ నుండును కొమ్మలుండుటచే నాగ జెముడు వలెనే యుండును. కాని ఇవి రెండును వేరు వేరు కుటుంబముల లోనివి.
శిఖండి మొక్క కూడ, బొమ్మ జెముడువలెనే యుండును. పైరెండింటి పుష్పములందును దీని పుష్పముల యందొక్క విశేషము గలదు. మనకు చూడగనే పువ్వు వలె నగుపడు నది యొక పువ్వుగాదు. అది పువ్వుల గి8త్తి. దానిలోపల ఎన్నో పువ్వులు గలవు. ఈ పువ్వు నందలి రేకులు తామర గన్నేరు పువ్వులందలి రేకుల వంటివి కావు (ఇవి చేటికలు) ఇవియు రేకులు గానిచో నిక రేకులు లేవే. ఇది యెట్లు పూల గుత్తియనునని సందేహము కలుగ వచ్చును. వీనిలోపల ల్పెద్దు కింజల్కములును కొన్నిటి మధ్యనొక యండకోశమును గలదు. ఒక్కొక్క కింజల్కము, ఒక్కొక అండ కోశమే,. యెక్కొక పువ్వు. పుష్పమునకు ప్రధానాంగములు కింజల్కము అండ కోశములే గాని పత్రములు గావు. ఆముదపు వుప్పునందు (పుష్పకోశము) ఈ ముఖ్యాగములను గాపాడుటకు పత్రములు