Jump to content

పుట:VrukshaSastramu.djvu/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

387

ను కింజల్కములో, అండకోశమో మాత్రముగలదు. దీని యందీపత్రములు కూడ లేకుండ పోయెను. ఇట్టిది నిర్ధారణ చేయు టెట్లనిన కింజల్కములను చూచినను బోధకము కాగలదు. వీని కాడలు సరాసరిగ లేవు. మధ్యనొక కణపు గలదు. కణుపు దగ్గిరకు వానిని సులభముగ విరువ వచ్చును. కణుపు వరకును పుష్పమునకు ఉండెడు కాడ, పైది కింజల్కము యొక్క కాడ. ఈ కణపు వద్దనే పత్రములు పెరుగ వలసినది గాని పెరుగ లేదు ఈవిధముననే స్త్రీపుష్పము కూడ గలదు.

సిందూరము చెట్లు మనదేశములో పలుతావుల బెరుగు చున్నవి. వానికాయల నుండి రంగు తీయుదురు. కాయల మీద రోమముల వంటివి యున్నవి. వీని యందే రంగు పదార్థము గలదు. కాననివి రాలిపోవువరకు కాయలను చేతులతోడరాచెదరు. లేదా, ఒక సంచిలో బోసికొట్టెదరు. ఈ పొడుమును కాయ ముక్కలు లేకుండ బాగు చేసి రంగుగ నుపయోగింతురు. ఈ రంగు తరుచుగా బట్టుబట్టలకే వేయుచుందురు.

పెంటంగచెట్టు కొండలమీద పెద్దదిగా పెరుగును. దీని పువ్వులు ఆకు పచ్చగా నుండును. (అండాశయము) కాయలో రెండు గదులేగలవు. ఒక్కొక్క గదిలో రెండేసి గింజలుండును.