385
మూర్కొండ అన్ని చోట్ల పెరుగును. దాని పువ్వులగుత్తులందము గానుండుటచే తోటలందు పెంతురు.
జయపాల మొక్క ఆకునకు చెడు వాసన గలదు.
తెల్ల చెట్తు అడవులలోను తేమ చోట్ల నుండును. కొమ్మలు నరుగకానె తెల్లని పాలు గారును. ఈ పాలతో రబ్బరు చేయవచ్చును. కలప పెట్టెలు చేయుటకు పనికి వచ్చును. గాని పెట్టెలంత గట్టిగా నుండవు. దీని యందు త్వరగా నంటుకొని మండెడు గుణము గలదు కాన అగ్గిపుల్లలు చేయుటకు వీలుగా నుండును.
జముడు చెట్టు చెట్టంతయు ఆకుపచ్చగానే యుండును. ఆకులున్నట్లే గనుపింపవు గాని, దూర దూరముగ సన్నని ఆకులు గలవు. ఇవియు త్వరగా రాలిపోవును. ఆకులుండినయెడల ఆకుల ద్వార నీరు పోవుఛుండును గనుక నీరు సమృద్ధిగ దొరకని చోట్ల పెరుగు చెట్లకు ఆకులు చిన్నవిగా నుండుటయే.. లేకుండుటయో తటస్థించును. ఆకులు లేనప్పుడు, వాని పనియు కొమ్మలే చేయవలసి యుండును గనుక, చెట్ల కావశ్యకమై సాధరణముగా ఆకులందుండు ఆకుపచ్చని పదార్థము దీనికొమ్మల యందేగలగు చున్నది. దీని పాలనుండియు రబ్బరు చేయవచ్చును. కొన్ని చోట్ల కాకులను చంపుటకు దీ