Jump to content

పుట:VrukshaSastramu.djvu/388

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

384

స్త్రీ పుష్పములు
-. అడుగుభాగమున పురుష పుష్పములు గలవు.
నేలపురుగుడు
- ఒక తీగ. కాలువల వారలను దొంకల మీదను నుండును. దీని పువ్వులు తెల్లగానుండును.
ఎర్రపురుగుడు
- పెక్కుచోట్ల గలదు. ఇది పెద్దమొక్క. దీని పండ్లెర్రగా నుండును.
పెద్ద ఉసిరి
-. రాచఉసిరియు, ఆడవులంనును తోటలందును పెరుగుచున్నవి. పెద్దయుసిరియన్నను మనకు గౌరవము గలదు. తోటలలో నొక మొక్క యుండినా, తోట పావనమైనట్లు భావింతుము. క్షీరాబ్ధి ద్వాదశినాడు దీని కొమ్మ నొక దానిని తెచ్చి పూజ చేతుము. పెద్ద ఉసిరి కాయలతో పచ్చడి పెట్టి నిలువ యుంచుదుము. రాచ యుసిరి కాయల తోడను పచ్చడి పులూ చేసి కొందుము. రాచ ఉసిరి ఆకులందొక విశేషము గలదు. సాధారణముగ అన్ని ఆకులు మొదలు నుండి పెరుగుచు త్వరలోనే పెద్దదై యిక పెరుగుట మానును. కాని రాచ యుసిరి ఆకులు (మిశ్రమ పత్రములు) చిట్టి ఆకు వేయుచునే యుండును. పెద్ద యుసిరి కాయలు, చెట్టు బెరడుల ఆకులును చర్మములు బాగు చేయుట యందు పనికి వచ్చును.