Jump to content

పుట:VrukshaSastramu.djvu/387

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

383

కొండాముదము
-. కొండలమీద విరివిగా పెరుగును.

కాయలు ఆముదపు కాయలవలెనే యుండును. దీని గింజల చమురు విరేచనకారి.

ఉచ్చి ఉసిరిక
- సాగు చేయు మెట్టనేలలందు బెరుగును. పురుష పుష్పములకు తొడిమ లేదు. కాని స్త్రీ పుష్పములకు గలదు. ఆకులు, పువ్వులు కాయలు కూడ మూత్ర వ్యాధులందౌషధములుగా నుపయోగించును. ఆకులను మజ్జిగలో నాన వేసి దీనితో శరీరము రుద్దులినిన యెడల చిడుముపోవును.

నేలసిరియు సాగుచేయుచోట్లనే బెరుగును. ఔషధ ములందు దీని వేళ్ళు ఉపయోగపడును. తెల్లఉసిరక నేల యుసిరిక వలె నుండును. దీని ఆడు పువ్వులలో కొన్ని గొడ్డు పువ్వులే గాని కాయలుగాయవు.

ఎర్ర ఉసిరక కొమ్మలు ఎర్రగా నుండును. దీనిని పశువులుతినును.

రవసల బర్రకాడ
- సముద్ర తీరములనుండును. సంవత్సరము పొడవున పుష్పించును. కొమ్మల పై భాగమున