పుట:VrukshaSastramu.djvu/386

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

382

లకు దీనినే ఉపయోగించెడి వారు. దీని దీపము ప్రకాశముగానే యుండును. కాని కిరసనాయలు దీని కంటె చౌక యగుట చేతను, ఆముదము చిక్కగా నుండి గాజు దీపముల కనుకూలింపక యుండుట చేతను దీనిని మానినాము. ఇప్పుడును గొందరు కొందరు కిరసనాయులు పొగ అనారోగ్యమని ఎంచి పడక గదులందు ఆముదపు దీపములనే పెట్టుకొను చున్నారు. చంటి పిల్లలకు పెట్టెడు ఆముదము వేయించిన గింజలనుండి గాని, ఉడకబెట్టిన గింజలనుండి గాని తీసిన చమురు. పచ్చి ఆముదము కంటె నిది ఎక్కువ ఆఅరోగ్యము. ఆముదము మంచి విరోచన కారి. మరలు త్రుప్పుపట్టకుండ దీనిని రాయు చుందురు.

ఆముదపు తెలకపిండిని పశువులకు నేయుదురు కాని అది అంత మంచిది కాదందురు. అది బాగుగ మండును గాన వంట చెరుగుకా నుపయోగించు చున్నారు. ఇది చెరుకు తోటలక్కు మిక్కిలి బలము చేయును.

ఆముదపు ఆకులు పశువులు తినిన పాలెక్కువనిచ్చును.

ఆముదము విత్తులు కూడ మన దేశమునుండి ఇతర దేశములకు చాల ఎగుమతి అగు చున్నవి.