పుట:VrukshaSastramu.djvu/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

381

ముగ కాయలు పగులబోవు నప్పుడు కోసెదరు. ఒకవేళఅవి పగుల కున్న యెడల వానిని గోసి, ఎండ బెట్టి రోకళ్ళతో గొట్టుదురు. లేదా రెండు ముడు దినములలో గోతిలో బాతి పెట్టిన పిదప వానిని నలుగ గొట్టుదురు.

దీని గింజలనుండి ఆముదమును నాల్గు విధముల దీయు చున్నారు. కొందరీ గింజల నొక సంచిలో బోసి రోకండ్ల వంటి వాని మధ్యన బెట్టి వానిని (మరల సహాయమున) దగ్గరగా నొక్కు చున్నారు. కొందరట్లు నొక్కుటకు బూర్వమొక రాత్రి గింజలను నీళ్ళలో నాన బెట్టెదరు. మరి కొందరు గింజలను వేయించి పొడుము గొట్టి ఈ పొడుమును నాలిగింతల నీళ్ళలో పోసు మరుగ బెట్టుదురు. ఆముదము నీళ్ళకంటె తేలిగగుట చే నీళ్ళమీద తేలుచుండును. అట్లు తేలు దానిని మరియొక పాత్రలోని కోడ్చుచుందురు. వేయించుటకు బదులు నీళ్ళతో గాచి ఎండబెట్టుట మరియొక పద్ధతి. ఈ పద్ధతులన్నియు మరలు లేని చోట్ల గలవు కాని యంత్ర సాహాయ్యమున ఆముదము చేయుటయే ముఖ్య పద్ధతి.

దాదాపు ఇరువది సంవత్సరముల వెనుక వరకు ఆముదమునమ్మకము ఎక్కువగానుండెడిది. అందరునుదీపము