పుట:VrukshaSastramu.djvu/384

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

380

అండకోశము. అండాశయముఉచ్చము. 3 గదులు. ఒక్కొక్క గింజ. బీజపుచ్చము గలదు. కాయ బహు విదారుణఫలము.

ఈ కుటుంబపు మొక్కల లో ఆకులు ఒంటరి చేరిక. లఘు పత్రములు. పువ్వులు చిన్నవి. ఏకలింగ పుష్పములు. అండకోశము నందు సాధరణముగ 3 గదులు. వ్రేలాడువిత్తులు. ఈ కుటుంబమును, అండాశయము యొక్క గదులయందు నొక్కొక గింజ కలదో, రెండేసి యో, పుష్పము లందాకర్షణ పత్రములు గలవో లేవో, కింజల్కములెన్ని గలవో, కాయ ఎండు కాయయో, కింజల్కములెన్ని గలవో కాయ ఎందు కాయయో లోపెంకు కండకాయమో, ఈ యంశములను బట్టి జాతులుగను తెగలుగను విభజించి యున్నారు.

ఆముదపు మొక్కలలోనే రెండు మూడు రకములు గలవు. కొన్ని మూడడుగులే బెరుగును కాని మరికొన్ని 6 -7 అడుగుల వరకు కూడ పెరుగును. అవి నల్ల గారిడి నేలలో గాని, ఇసుక నేలలో గాని బాగుగ పెరుగ నేరవు. నివి వరి మొదలగు వాని చేల గట్ల మీద గాని, ప్రత్యేకముగా వానినే పొలములలో గాని వేయుదురు. విత్తనములు చల్లిన పిదప రెండు మూడు వర్షములు కురిసిన చో మొక్కలు ఏపుగా బెరుగును 7 = 8 నెలలలోనే పంటకు వచ్చును. సాధారణ