పుట:VrukshaSastramu.djvu/374

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

370

ప్పుడేదీసి వేరుచోట బాతుదురు. ఇవి పదేండ్లకు ఫలితమునకు వచ్చును.

వర్షములును లేక, ఎండ ఎక్కువగను లేనప్పుడే ఆకులను కోయుట ఆరంబింతురు. లేత చెట్ల కేటేట కోయుదురు గాని ముదురు వాని ఆకులు రెండేసి ఏండ్ల కొక మాటే కోయుచుందురు. ఇట్లు చెట్టునకు నూరు సంవత్సరముల వరకు కోయవచ్చును.

దీని ఆకులను కొందరు వంటలో ఉప యోగించెదరు. కరక్కాయలతో గలిపి రంగు వేయుటలో వాడుదురు. మరియు ఔషధములలో వాడుదురు.


అగరు కుటుంబము.


అగరుచెట్టు కొండలమీద బెరుగును. లేకొమ్మల మీద పట్టు వంటి రోమములు గలవు.

ఆకులు
- ఒంట్రి చేరిక. లఘు పత్రములు బల్లెపాకారము. పొడవు 2 - 3/2 అంగుళములు. విషమరేఖపత్రము. సమాంచలము కొన వాలము గలదు.
పుష్పమంజరి
- రెమ్మగుత్తి. తెలుపు ఎకలింగపుష్పములు.
పుషనిచోళము
- సంయుక్తము 5 తమమెలు అల్లుకొని యుండును నీచము.